Tekst piosenki:
గుండెలోన నిండుకున్న
నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ
కళ్ళలోన నింపుకున్న
నీ రూపమేగ ఊరటయ్యే ఇన్నాళ్లూ
చెప్పనీ చెప్పనీ మనసు తాలలేదని నీ దూరమే
తప్పనే తప్పని తాపమే తీరనీ ఈ నాడే
గుండెలోన నిండుకున్న
నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ
నీ అడుగులోన అడుగు కలిపి ప్రాణమే మురవని
నా అణువు అణువు నిన్ను చేరి తనివి తీరనీ
ఏ దారి మలపులోను ఇంక వీడనే వీడనీ
నీలోని నీడ నేనులాగ నన్ను మారనీ
తిమిరం తెర తొలిగిపోయి వెలిగే నవ ఉదయాలే
ప్రాణం చెయ్ జారి మళ్ళి చేరగ తన తీరాన్నే
కమ్మనైన ఓ హాయివాన కురావగా ఇలా చిరునవ్వులోన
గుండెలోన నిండుకున్న
ఊసులన్ని చెప్పుకోగా ఈనాడు
కళ్ళలోన దాచుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
ఆగని ఆగని ఆదమరుపులే కదా ఇక అన్నీ
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ
గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
పరవశం పరవశం అవ్వనీ మన వశం
చిలకరించు నవ్వులు మనకి ఈ జగం
చెరు సగం చెరు సగం అవ్వగా ఓ సుమం
పలకరించు ఆశలే హృదయనందనం
అలలే జోలలను పాడి అలుపే మరిచేనే
కలలే నీ ఒడిన వాలి నిజమై మెరిసేనే
అల్లుతున్న హరివిల్లులోన అందుకోగా స్వర్గసీమ
గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
ఆగని ఆగని ఆదమరుపులే కదా ఇక అన్నీ
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ
గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
Dodaj adnotację do tego tekstu »
Historia edycji tekstu
Komentarze (0):